భారతదేశం, సెప్టెంబర్ 7 -- హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అత్యంత విశిష్టత ఉంది. ముఖ్యంగా అజా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఈసారి అజా ఏకాదశి సోమవారం రావడంతో శివారాధనకు, చంద్ర పూజకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జాతకంలో చంద్ర దోషాలు ఉన్నవారు ప్రతి సోమవారం శివునికి విశేష అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

చాలామంది శుక్ల పక్షం, కృష్ణ పక్ష ఏకాదశుల మధ్య తేడా చూపిస్తుంటారు. కానీ, ఏకాదశి విషయంలో ఎలాంటి భేదభావం చూపించకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. నెలలోని రెండు ఏకాదశి వ్రతాలను ఆచరిస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. కృష్ణ పక్ష ఏకాదశిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం...