Andhrapradesh, ఆగస్టు 27 -- ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమవాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం. ఇవాళ(ఆగస్ట్ 27) ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి సాలపువానిపాలెంలో 60.2 మిమీ, శ్రీకాకుళంలో 58 మిమీ, విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో 55.7 మిమీ అనకాపల్లి జిల్లా గంధవరంలో 55.5 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక లంకేలపాలె...