భారతదేశం, ఆగస్టు 11 -- తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. ఆగస్ట్ 13వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆగస్ట్ 13 నుంచి 16వ తేదీ వరకు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. దీంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ(ఆగస్ట్ 11) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయి.

ఇగ ఆగస్ట్ 13వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దప...