భారతదేశం, సెప్టెంబర్ 24 -- భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్, కొత్త ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ (Ultraviolette X47 Crossover) ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.74 లక్షలుగా ఉంది. అయితే, తొలి 1,000 మంది వినియోగదారులకు ఈ బైక్‌ను రూ. 2.49 లక్షల ప్రత్యేక ప్రారంభ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్‌కు బుకింగ్‌లు సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యాయి. డెలివరీలు అక్టోబర్ 2025 నుంచి మొదలవుతాయి.

ఈ బైక్ లేజర్ రెడ్, ఎయిర్‌స్ట్రైక్ వైట్, షాడో బ్లాక్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. దీని డిజైన్ అడ్వెంచర్ టూరర్, స్ట్రీట్‌ఫైటర్ బైక్ కలయికలా కనిపిస్తుంది. ఎఫ్77 ఆర్కిటెక్చర్‌పై నిర్మించినప్పటికీ, ఇందులో కొత్త ఛాసిస్, సబ్‌ఫ్రేమ్ వా...