అర్నబ్ తుఫాను బీభత్సం: అమిత్ షాతో చంద్రబాబు ఫోన్ ఇన్, కేంద్ర సాయానికి విజ్ఞప్తి
భారతదేశం, అక్టోబర్ 29 -- అమరావతి: 'అర్నబ్' తుఫాను సృష్టించిన తీవ్ర వినాశనంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్లో సంభాషించారు. రాష్ట్రంలో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం సహా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ఆయన అమిత్ షాకు కూలంకషంగా వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు తక్షణమే కేంద్ర బృందాలను పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 70,000 హెక్టార్లకు పైగా వ్యవసాయ పంటలు నీట మునిగాయని వివరించారు. మరొక 10,500 హెక్టార్లకు పైగా ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.