భారతదేశం, అక్టోబర్ 28 -- అర్నబ్‌ తుపాన్ మూలంగా ఆస్తి, పంట నష్టాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్క కుటుంబానికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తుపాన్ పరిస్థితిపై నిరంతర సమీక్షలు నిర్వహించామని, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. ఈ విపత్తులో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతిచెందిన వారి కుటుంబాలకు రూ5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు అన్నారు. షెల్టర్ క్యాంపుల్లో ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికీ రూ.1,000 అందించనున్నారు. ముంపునకు గురై ఇళ్లల్లోకి నీరు చేరిన ప్రాంతాల ప్రజలకు 25 కేజీల బియ్యం పంపిణీ చేస్తారని ప్రకటించారు. చేనేత కార్మికులు...