భారతదేశం, ఫిబ్రవరి 28 -- గత కొంతకాలంగా తమిళనాడులోని అరుణాచలానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వెళ్తున్నారు. పౌర్ణమి వేళ ఈ సంఖ్య భారీగానే ఉంటుంది. కొందరు ట్రైన్స్, మరికొందరు సొంత వాహనాల్లో అరుణాచలం వెళ్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.... రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని నాంపల్లి నుంచి కన్యాకుమారి మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను రెగ్యులర్ సర్వీస్ గా క్రమబద్ధీకరించింది.

గత ఐదు సంవత్సరాలుగా నాంపల్లి - కన్యాకుమారి(ట్రైన్ నెంబర్ 07229/07230) ఎక్స్ ప్రెస్ వీక్లీ రైళ్లుగా రాకపోకలు సాగిస్తోంది. అయితే ఇకపై ఈ ఎక్స్ ప్రెస్ రెగ్యులర్ సర్వీస్ గా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ట్రైన్ నెంబర్ ను మార్చారు. రెగ్యులర్ సర్వీస్ గా మారిన నేపథ్యంలో నాంపల్లి - కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ నెంబర్ 17069/17070గా మార్పు చేశార...