Arakua,andhrapradesh, ఆగస్టు 10 -- గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీలకు జీవనోపాధి అవకాశాలు,అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్లాం టి అంశాల్లో ఏపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వివిధ సంస్థలు ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

అరకు కాఫీ మార్కెటింగ్ సహా వివిధ అటవీ, గిరిజన ఉత్పత్తులకు దేశీయంగా, విదేశాల్లో మార్కెటింగ్ కల్పించేలా ఈ అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతంలో రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు వివిధ మౌలికసదుపాయాల కల్పన, సాగు విస్తరణ కోసం కేంద్రీయ రబ్బర్ బోర్డు. ఐటీడీఏ తో ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజన ఉత్పత్తుల విక్రయాలు, అరకు కాఫీకి ప్రోత్సాహం కల్పించేందుకుగానూ జీసీసీతో ఒప్పందం కుది...