Telangana,jagityala, ఆగస్టు 7 -- జీవనోపాధి కోసం ఎంతో మంది తెలుగు బిడ్డలు గల్ఫ్ దేశానికి వెళ్తుంటారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఓ వ్యక్తి సౌదీకి వెళ్లాడు. కుటుంబాలకు దూరంగా ఉంటూ సంవత్సరాలుగా అక్కడే గడిపాడు. ఇంతలోనే స్వస్థలానికి వచ్చేందుకు గంపెడు ఆశలతో సిద్ధమయ్యాడు. అనుకున్నట్లు టికెట్ బుక్ చేసుకొని. స్వదేశానికి బయల్దేరగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో గాల్లోని ప్రాణాలు కలిసాయి.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్‌లో జీవనం కొనసాగిస్తున్నాడు.మంగళవారం రాత్రి సౌదీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో శ్వాస సమస్య తలెత్తింది. శ్వాస ఆడటం లేదని తెలియజేయగా విమానాన్ని వెంటనే ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చే...