భారతదేశం, నవంబర్ 20 -- రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని ఓ ఐటీ కంపెనీ కార్యాలయం ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప దీక్ష చేపట్టిన ఓ ఉద్యోగిని కంపెనీ లోపలికి అనుమతించలేదన్న ఆరోపణలతో అయ్యప్ప భక్తులు, వివిధ హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

కార్తీక, మార్గశిర మాసాల్లో శబరిమల యాత్ర కోసం భక్తులు మండల దీక్ష చేపట్టడం ఆనవాయితీ. ఈ దీక్షా కాలంలో నలుపు లేదా కాషాయ వస్త్రాలు ధరించడం, పాదరక్షలు లేకుండా నడవడం వంటి కఠిన నియమాలను పాటిస్తారు. అయితే, కార్పొరేట్ సంస్థల్లో అమలు చేసే డ్రెస్ కోడ్ నిబంధనల కారణంగా ఆదిభట్ల ఐటీ కంపెనీలో తాజా వివాదం రాజుకుంది.

ఆదిభట్లలోని సదరు ఐటీ కంపెనీలో మనీష్ అనే యువకుడు రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. తాను అయ్యప్ప దీక్ష తీసుకోబోతున్నట్లు రెండ...