భారతదేశం, నవంబర్ 11 -- శబరిమలలో ఉన్న 18 పవిత్ర మెట్లను పతినెట్టాంపడి అని అంటారు. ఈ మెట్లు అయ్యప్ప భక్తులకు అత్యంత పవిత్రమైనవి. 18 మెట్లు అధిరోహించడం అనేది ఆలయంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా మనలో ఉండే అరిషడ్వర్గాలు, ఇంద్రియాలపై నియంత్రణ సాధించడానికి ప్రతీకగా భావిస్తారు.

ఈ 18 మెట్లకు పలు ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రసిద్ధ వివరణ ప్రకారం చూసేద్దాం.

ఈ మెట్లను అధిరోహించడం వలన భక్తుడు ప్రాపంచిక బంధాలను అధిగమించి దైవచింతనలోకి ప్రవేశిస్తాడని విశ్వాసం. అయితే అయ్యప్ప భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు కచ్చితంగా ఏడు విషయాలను తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

సంప్రదాయం ప్రకారంగా చూసినట్లయితే, అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు నియమనిష్ఠలతో దీక్షను పాటిస్తారు.

ఇరుముడిని తలపై ధరించిన తర్వాతే 18 పవిత్ర మెట్లు ఎక్కాలి.

ఇరుముడి క...