భారతదేశం, నవంబర్ 12 -- శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది. మండల, మకరవిళక్కు పూజల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ ప్రాంతాల నుంచి కేరళలోని కొల్లం వరకు మొత్తంగా 54 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్, డిసెంబర్ నెలలతో పాటు వచ్చే ఏడాది జనవరి మాసంలోనూ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

రైలు నెంబర్ 07193 హైదరాబాద్ - కొల్లం ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ మీదుగా 4 సర్వీసులు నడుస్తాయి. డిసెంబర్ 5, 12, 19, 26 (శనివారాలు) రైళ్లు ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి 11:10కి బయల్దేరి, సోమవారం ఉదయం 7:15కి కొల్లం చేరుకుంటుంది.

07194 కొల్లం ...