అమ్మ మనసు చాటుకున్న గుత్తా జ్వాల: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసి ఎందరో చిన్నారులకు పునర్జన్మ
భారతదేశం, మే 15 -- ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా తన జీవితంలోని అత్యంత వ్యక్తిగతమైన, స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తల్లయ్యాక గడిచిన ఏడాది కాలంలో తాను సుమారు 60 లీటర్ల తల్లిపాలను సేకరించి, ప్రభుత్వ ఆసుపత్రులకు అందించినట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ దంపతులకు 2025 ఏప్రిల్లో కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే, తల్లిపాలు అందక ఇబ్బంది పడే పసిపిల్లల కోసం ఆమె ఒక గొప్ప సంకల్పాన్ని చేపట్టారు. హైదరాబాద్, చెన్నై నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (NICU) చికిత్స పొందుతున్న చిన్నారుల కోసం ఆమె ఈ పాలను విరాళంగా ఇచ్చారు.
"తల్లిపాలు దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనం అపారం. కేవలం 100 మిల్లీలీటర్ల త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.