భారతదేశం, అక్టోబర్ 30 -- నేటి డిజిటల్ యుగంలో భారతీయ ఇన్వెస్టర్ల ఆలోచనా దృక్పథం వేగంగా మారుతోంది. కేవలం దేశీయ స్టాక్ మార్కెట్లకే పరిమితం కాకుండా, ప్రపంచాన్ని ఏలుతున్న యాపిల్, మెటా, అమెజాన్, ఎన్విడియా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో భాగస్వామ్యం వహించేందుకు భారతీయ ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నెక్ట్స్-జెన్ సాంకేతిక విభాగాలలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి భారతీయ స్టాక్ ఎక్స్​ఛేంజీల్లో పరిమిత అవకాశాలు మాత్రమే ఉండటంతో.. అమెరికా స్టాక్ మార్కెట్ మన ఇన్వెస్టర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారింది!

ఈ నేపథ్యంలోనే భారతీయ నివాసితులు విదేశీ షేర్లలో పెట్టుబడి పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెచ్చిన 'లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్' (ఎల్​ఆర్​ఎస్), గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ ద్వారా పనిచేసే అంతర్జాతీయ ...