భారతదేశం, ఏప్రిల్ 29 -- అమెరికా కలలు కనే భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ పిడుగులాంటి వార్త చెప్పింది. తమ సొంత దేశంలో ప్రాణహాని ఉందని లేదా హింసకు గురయ్యే ప్రమాదం ఉందని భావించే వారికి ఇకపై నాన్-ఇమ్మిగ్రెంట్ (తాత్కాలిక) వీసాలు ఇవ్వకూడదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలకు (Embassies) అత్యంత రహస్యంగా కేబుల్ సందేశాలు పంపింది.

విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వంలో రూపొందించిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. వీసా ఆఫీసర్లు ప్రతి దరఖాస్తుదారుడిని రెండు కీలక ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది:

"మీ దేశంలో మీరు ఎప్పుడైనా హింసకు లేదా వేధింపులకు గురయ్యారా?"

"మీ దేశానికి తిరిగి వెళ్తే అక్కడ మీకు ప్రాణహాని లేదా వేధింపులు ఎదురవుతాయనే భయం ఉందా?"

ఈ రెండు...