భారతదేశం, సెప్టెంబర్ 22 -- విద్యుత్‌ రంగంలో అంతర్జాతీయ విస్తరణను మరింత బలోపేతం చేసుకుంటూ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(SSEL), అమెరికా మార్కెట్‌కు తన తొలి 175 ఎంవీఏ, 345 కేవీ ఎక్స్‌ట్రా హై ఓల్టేజీ(EHV) పవర్ ట్రాన్సఫార్మర్‌ను విజయవంతంగా ఎగుమతి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నైనీ తయారీ కేంద్రంలో ఈ అధిక సామర్థ్యం కలిగిన ఈహెచ్‌వి పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తయారు చేశారు.

అమెరికాకు ఈ తొలి ఈహెచ్‌వి పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎగుమతి, అంతర్జాతీయ విద్యుత్‌ ప్రసార మార్కెట్లలో ఎస్ఎస్ఈఎల్ సామర్థ్యాలకు మరో ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది. అధిక సామర్థ్యం కలిగిన పవర్‌ ట్రాన్స్ఫార్మర్‌ను అత్యున్నత ఇంజినీరింగ్‌, నాణ్యత, పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి, అంతర్జాతీయ యుటిలిటీ మార్కెట్ల అవసరాలను తీర్చగే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ ...