భారతదేశం, సెప్టెంబర్ 1 -- అమెరికాలో శాశ్వత నివాస అర్హత (గ్రీన్ కార్డ్) సాధించాలనే వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల కల నెరవేరడం అంత సులువు కాదని స్పష్టమవుతోంది. 2026 జనవరి లేదా ఆ తర్వాత ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు శాశ్వత నివాస హోదా పొందేందుకు ఏకంగా 179 ఏళ్లు వేచిచూడాల్సి రావచ్చు. ప్రముఖ పరిశోధనా సంస్థ 'నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ' (ఎన్‌ఎఫ్‌ఏపీ) విడుదల చేసిన తాజా విశ్లేషణాత్మక నివేదికలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో ప్రస్తుతం ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌ల కోసం దాదాపు 10 లక్షల మంది (9,96,599) భారతీయ నిపుణులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు క్యూలో వేచి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న మొత్తం దరఖాస్తుదారుల్లో ఒక్క భారతీయులే 79 శాత...