భారతదేశం, నవంబర్ 4 -- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనకు అక్కడి ఓటర్లు ఊహించని రీతిలో కోలుకోలేని షాక్ ఇచ్చారు. మంగళవారం జరిగిన యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ చారిత్రక విజయాన్ని కైవసం చేసుకుంది. యూఎస్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్ ఉభయ సభల్లోనూ డెమొక్రాట్లు ఘనవిజయం సాధించారు. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, టెక్సాస్, కాన్సాస్ వంటి బలమైన రిపబ్లికన్ కోటలను డెమొక్రాట్లు బద్దలు కొట్టారు. టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో గవర్నర్ పీఠాలను సైతం డెమొక్రాట్లు కైవసం చేసుకున్నారు.

ప్రతినిధుల సభలో మెజారిటీకి కావాల్సిన 218 స్థానాల కంటే ఎక్కువగా, ఇప్పటికే డెమొక్రాట్లు కనీసం 228 సీట్లు సాధించారు. ఎన్‌బీసీ న్యూస్ అంచనాల ప్రకారం డెమొక్రాట్లు ఏకంగా 258 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా, రిపబ్లికన్లు 177 సీట్ల...