భారతదేశం, ఆగస్టు 26 -- రష్యా చమురు కొనుగోలు చేస్తుందనే కారణం చూపి అమెరికా భారత్‌పై అదనపు సుంకాలను ప్రకటించింది. దీనిపై తాజాగా భారత ప్రభుత్వానికి నోటీసులు పంపింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ప్రకారం భారతదేశంపై విధించిన అదనపు 25 శాతం సుంకం 2025 ఆగస్టు 27 నుండి అమలు కానుంది. దీనితో భారతదేశంపై అమెరికా విధించిన మొత్తం సుంకం 50 శాతానికి పెరుగుతుంది. భారతదేశంపై ట్రంప్ సుంకాల దాడి తర్వాత ప్రతి ఒక్కరూ దాని ప్రభావాన్ని తగ్గించడానికి భారతదేశం ఏ ఆప్షన్స్ కలిగి ఉందో చూస్తున్నారు.

భారతదేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం అదనపు సుంకం విధించే అధికారిక నోటిఫికేషన్‌ను అమెరికా జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీకి కూడా నోటీసులు పంపింది. కొత్త సుంకంతో భారతదేశంపై మొత్తం 50 శాతం సుంకం అమలులోకి వస్తుంది. గతంలో డోనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకం విధించగా అది ఆగస్టు 7...