భారతదేశం, అక్టోబర్ 5 -- అమెరికాలో మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన పోలే చంద్రశేఖర్‌(27) మృతి చెందాడు. 2023లో బీడీఎస్‌ పూర్తి చేసిన చంద్రశేఖర్.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కుమారుడి మృతిపై సమాచారం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఈ సంఘటన గురించి చంద్రశేఖర్ తల్లి సునీత ఏఎన్ఐతో మాట్లాడారు. "నా కొడుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అతను ఇక్కడ దంత వైద్యుడు అయ్యాడు. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి అక్కడికి వెళ్ళాడు. అతని స్నేహితుడి తల్లిదండ్రుల ద్వారా మాకు సమాచారం తెలిసింది. నల్లజాతీయుడని అతన్ని కాల్చి చంపారని మాకు తెలిసింది. నా కొడ...