భారతదేశం, నవంబర్ 27 -- అమెరికా తూర్పు తీర ప్రాంతాలను శక్తిమంతమైన 'నార్‌ఈస్టర్' తుఫాన్ అతలాకుతలం చేసింది. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే థ్యాంక్స్ గివింగ్ పండుగ సంబరాలను ఈ ఆకస్మిక వరదలు నీరుగార్చాయి. తుఫాన్ ప్రభావంతో న్యూజెర్సీ, న్యూయార్క్, మేరీల్యాండ్, వర్జీనియా, డెలావేర్, వాషింగ్టన్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు తూర్పు ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో తీవ్ర వరదలు ముంచెత్తాయి. వీటిలో న్యూజెర్సీ రాష్ట్రం అత్యధికంగా ప్రభావితమైంది. అక్కడి ప్రధాన పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వీధులు, నివాసాలు, వ్యాపార సముదాయాల్లోకి భారీగా వరద నీరు చేరింది.

అట్లాంటిక్ మహాసముద్ర తీరం వెంబడి ఏర్పడే నార్‌ఈస్టర్ తుఫాన్లు బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలు, సముద్రపు అలల ఉద్ధృతిని తీసుకొస్తాయి. తాజా తుఫాన్ ముప్పును పసిగట్టిన నేషనల్ వెదర్ సర్వీస...