భారతదేశం, మే 23 -- అమెరికాలో ఐటీ నిపుణులుగా స్థిరపడి, అక్కడ శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న భారతీయ కుటుంబాలకు తాజా నిబంధనలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియలో అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) శుక్రవారం జారీ చేసిన కొత్త మెమో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి వెళ్లి అక్కడ హెచ్-1బీ (H-1B) వీసాలపై కొనసాగుతున్న లక్షలాది మంది తెలుగు వారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. అమెరికాలో తాత్కాలిక వీసాలపై (H-1B, L-1 వంటివి) ఉన్న వారు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, వారు అమెరికాలోనే ఉండి తమ వీసా హోదాను మార్చుకునే (Adjustment of Status) వెసులుబాటు ఉండేది. కానీ కొత్త మెమో ప్రకారం, ఈ హోదా మార్పు క...