భారతదేశం, డిసెంబర్ 27 -- అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం నివసించే కార్యాలయం వద్దే కాల్పుల కలకలం రేగింది. వాలెస్‌లోని షోషోన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం (Shoshone County Sheriff's Office) లోపల లేదా సమీపంలో ఒక సాయుధ దుండగుడు (Active Shooter) ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని కూటెనై కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు ధృవీకరించినట్లు స్థానిక పత్రిక 'కోర్ డి అలేన్ ప్రెస్' పేర్కొంది.

ఈ వార్త తెలియగానే పొరుగు ప్రాంతాల నుంచి పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. దాదాపు 40కి పైగా పోలీసు వాహనాలు, షెరీఫ్ బృందాలు, స్టేట్ పోలీస్ గార్డ్స్ వాలెస్ వైపు దూసుకుపోతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక జనం ప్రాణాలు అరచేతిలో ...