భారతదేశం, జూలై 7 -- ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ప్రైమ్ డే సేల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15పై వినియోగదారులకు భారీ డిస్కౌంట్ లభించనుందని కంపెనీ తెలిపింది. లాంచ్ ధరతో పోలిస్తే రూ.22 వేల డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను అందించనున్నారు.

ఐఫోన్ 15 బెస్ట్ కెమెరా సెటప్‌తోపాటు పెద్ద సిరామిక్ షీల్డ్ ప్రొటెక్టెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ తక్కువ ధరకు వస్తుంది. శక్తివంతమైన పనితీరు, మల్టీ-టాస్కింగ్ సామర్థ్యం కోసం ఇది ఆపిల్ ఎ16 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో వినియోగదారు అనుభవం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.

అమెజాన్ సేల్ సందర్భంగా వినియోగదారులు ఆపిల్ ఐఫోన్ 15ను ప్రత్యేక డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. కూపన్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్ల తర్వాత దీని ధర ...