భారతదేశం, ఏప్రిల్ 21 -- హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో వైశాఖ మాసంలో వచ్చే 'మోహినీ ఏకాదశి'కి ఒక ప్రత్యేకత ఉంది. దుష్టశక్తుల నుంచి లోకాన్ని కాపాడి, దేవతలకు అమృతాన్ని అందించడానికి శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపం ధరించిన రోజే ఈ మోహినీ ఏకాదశి. ఈ ఏడాది ఏప్రిల్ 27న భక్తులు ఈ పవిత్ర పర్వదినాన్ని జరుపుకోనున్నారు.
స్కంద పురాణంలోని వైష్ణవ ఖండం ప్రకారం.. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ అమృతం కోసం దేవతలు, అసురుల మధ్య పెద్ద పోరాటమే జరిగింది. రాక్షసులు అమృతాన్ని దక్కించుకుంటే లోకానికి ముప్పు వాటిల్లుతుందని భావించిన విష్ణుమూర్తి, మోహినీ అనే అత్యంత సౌందర్యవతి రూపంలో ప్రత్యక్షమయ్యారు.
తన మాయాజాలంతో రాక్షసులను మైమరపించి, దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచారు. ఈ క్రమంలోనే స్వర్భానుడు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.