భారతదేశం, జూన్ 29 -- ప్రకృతి ఒడిలో వెలసిన స్వయంభూలింగం.. కఠినమైన కొండకోనలు దాటి భక్తి పారవశ్యంతో సాగే ప్రయాణం. ప్రతి ఏటా కోట్లాది మంది శివ భక్తులు తహతహలాడే అమర్‌నాథ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినంతో ముగియనున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణం భక్తులకు కన్నుల పండుగగా మారనుంది.

ఈ ఏడాది మొత్తం 57 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్ర కొనసాగనుంది. ఏప్రిల్ 15 నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో, భక్తులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో, సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర గుహను చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ, "హర హర మహాదేవ" నామస్మరణతో భక్తులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ బాబా దర్శనం కోసం తరలివస్తారు.

అమర్‌నాథ్ గుహలో నెలకొనే మంచు...