భారతదేశం, సెప్టెంబర్ 24 -- జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ.. న్యాయస్థానం కాదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిప‌క్ష హోదా వ‌స్తుందో అని కూడా తెలియ‌కుండానే జ‌గ‌న్ సీఎం ఎలా అయ్యాడ‌ని ఎద్దేవా చేశారు. గ‌తంలో తాము 23 మంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్లు త‌మ నుంచి న‌లుగురు స‌భ్యుల‌ను లాగేసుకున్నా... ధైర్యంగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల ప‌క్షాన పోరాటం చేశామ‌ని గొట్టిపాటి గుర్తు చేశారు.

అవినీతి, అక్రమాల‌కు సంబంధించి జ‌గ‌న్ జైలు నుంచి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చి నేటికి 12 ఏళ్లు పూర్తయిందని ఇందుకోస‌మే పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం నిర్వహిస్తున్నారేమోనని మంత్రి గొట్టిపాటి అన్నారు. జ‌గ‌న్ విధ్వంసంతో అమ‌రావ‌తి అభివృద్ధి ప‌నులు ఐదేళ్లు ఆలస్యం అయ్యాయని విమ‌ర్శించారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌రుగు...