భారతదేశం, జూలై 7 -- అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాలకు (Economic Regions) ఆరు నెలల్లోగా మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. అంతేకాదు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించిన విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం (VER) పరిధిలోని 'వైజాగ్ బే సిటీ' అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన సిటీ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు ముసాయిదా ప్రణాళికలను వారికి అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఆయా ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేలా కలెక్టర్లకు వీలుగా, రెండు నెలల్లోగా జిల్లా ఆర్థిక ప్రొఫైల్స్ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్(TER) అభివృద్ధికి ఉద్యానవన రంగం కీలక చోదక శక్తిగా...