అబ్దుల్లాపూర్మెట్ వద్ద రోడ్డు ప్రమాదం - ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 15 మందికి గాయాలు
భారతదేశం, అక్టోబర్ 19 -- రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇవాళ ఉదయం తీవ్ర రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటాసింగారం గ్రామం సమీపంలో ఆగి ఉన్న లారీ(ట్రక్కు)ని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. సదరు ఆర్టీసీ బస్సు ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ వైపు వస్తుంది. బాటాసింగారం సమీపానికి చేరుకోగానే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 15 మంది ప్రయాణికులను స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది సహాయంతో తక్షణమే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సమాచా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.