భారతదేశం, నవంబర్ 24 -- కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ప్రత్యేకించి పూజిస్తారు. కార్తీక మాసంలో శివ అష్టోత్తర శతనామావళిని చదువుకోవడంతో పాటు శివుడికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలను కూడా చదువుతూ ఉంటారు. అయితే కచ్చితంగా ఏ దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని చదువుకోవాలి? దారిద్ర దహన శివ స్తోత్రం వలన కలిగే లాభాలేంటి? ఏ విధంగా చదువుకోవాలి? దీనిని ఎప్పుడు చదువుకుంటే మంచిది? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ స్తోత్రాన్ని బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి రచించారు. ఇది ఒక శక్తివంతమైన శివ ప్రార్థన. దీనిని చదవడం వలన దారిద్ర్యం తొలగిపోతుందని నమ్ముతారు. ఈ స్తోత్రం అర్థం, అంతరార్థం ఏంటి? ప్రతి శ్లోకంలోనూ "దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ" అనే పదం వస్తుంది. దారిద్ర్యం, బాధలను పోగొట్టే శివుడికి నమస్కారం అని దీని అర్థం.

దీనిని చదవడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచ...