భారతదేశం, నవంబర్ 5 -- అడివి శేష్ మూవీ 'డెకాయిట్' అనౌన్స్ చేసి ఏడాది దాటింది. మృణాల్ ఠాకూర్‌తో కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వాస్తవానికి ఈ డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే శేష్‌కి అయిన గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కానుంది.

అదే రోజు కన్నడ సూపర్ స్టార్ యశ్ పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్' కూడా విడుదల అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద పోరు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ 'క్లాష్', సినిమా ఆలస్యం, విడుదల తేదీ గురించి హిందుస్థాన్ టైమ్స్‌తో అడివి శేష్ ప్రత్యేకంగా మాట్లాడాడు.

'డెకాయిట్' మూవీ విడుదలకు సిద్ధమయ్యే సరికి దాదాపు రెండేళ్లు పడుతుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ గురించి అడివి శేష్ మాట్లాడాడు. "నేను ఎప్పుడూ సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంటాను. ఇదివరకు నేను ఎవరికీ అంతగా తెలియదు కాబట్...