భారతదేశం, నవంబర్ 11 -- హైదరాబాద్‌లో ప్రతీ ఏటా పెరుగుతున్న వాహనాల సంఖ్య, దానికి తోడు ఐటీ కారిడార్‌లో నిత్యం నరకం చూపిస్తున్న ట్రాఫిక్ జామ్‌లకు శాశ్వత ముగింపు పలికేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. భారీ నివాస సముదాయాల వద్ద ఏర్పడుతున్న రహదారి రద్దీని తగ్గించేందుకు భవన నిర్మాణ నిబంధనలలో కీలక మార్పులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో 500 అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న బహుళ అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీలు వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ సొసైటీల లోపలికి బయటి వాహనాలను అనుమతించకపోవడంతో అసలు సమస్య మొదలవుతోంది.

ప్రయాణికులను ఎక్కించుకోవడానికి వచ్చే ఓలా, ఊబర్, ఐటీ కంపెనీల క్యాబ్‌లు, పాఠశా...