భారతదేశం, ఆగస్టు 12 -- ఎంతటి భారీ వానలు వచ్చినా.. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న 72 గంట‌ల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌నే వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరికల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల ఉన్నతాధికారులు, జిల్లా క‌లెక్టర్లతో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోత‌ట్టు కాజ్‌వేలు, ఉద్ధృతంగా ప్రవహించే న‌దులు, వాగులు, వంక‌ల‌పై వంతెన‌లపై నుంచి రాక‌పోక‌లు లేకుండా చూడాల‌ని సూచించారు. ప‌శువులు, గొర్రెలు, మేక‌ల కాప‌ర్లు త‌ర‌చూ వాగుల్లో చిక్కుకుపోతున్నార‌ని.. ఈ విష‌యంలో ముంద‌స్తుగా వారిని అప్రమత్తం చేయాల‌ని సీఎం ఆదేశించారు.

ఎక్కడైనా ఎవరైనా ప్రమాదవశాత్తూ చిక్కుకుంటే వారిని త‌క్షణమే బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చే ఏర్పాట్లు చేయ...