భారతదేశం, ఏప్రిల్ 8 -- ప్రజా రవాణా అందుబాటు ధరలో సమర్థవంతంగా ఉండాలని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయంలో రోడ్లు, హైవేలను సమీక్షిస్తూ, స్వచ్ఛమైన ఇంధన వినియోగం నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమర్థవంతమైన సౌర విద్యుత్ నిర్వహణ ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఖర్చులను యూనిట్‌కు సుమారు రూ.1 మేర తగ్గించిందని, ఇంధన వ్యయ ఆప్టిమైజేషన్‌ను మరింతగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.

'ప్రస్తుతం ఈవీ బస్సుల నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు సుమారు రూ.72గా ఉంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, బ్యాటరీ వ్యవస్థలను ప్రామాణీకరించడంపై దృష్టి సారించి, ఖర్చులను మరింత తగ్గించేందుకు మార్గాలను అన్వేషించాలి. అన్ని రకాల బస...