Andhrapradesh, సెప్టెంబర్ 20 -- అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాయచోటిలో కురిసిన భారీ వర్షం దాటికి కాలువలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ కాలువలో పడి ఓ మహిళతో పాటు ఆమె ఏడేళ్ల కుమారుడు మృతి చెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన పొరుగు వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.

డీఎస్సీ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం. షేక్ మున్నీ (28) మరియు ఆమె కుమారుడు ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ సమీపంలో నడుస్తూ వెళ్తున్నారు. కాలువను కప్పి ఉంచే రాతి పలక ఒక్కసారిగా విరిగిపోవటంతో. వారిద్దరూ అందులో పడిపోయారు. వారి పొరుగున ఉన్న గణేష్ (25) అనే వ్యక్తి వారిని రక్షించడానికి ప్రయత్నించాడు. కాని అతను కూడా భారీ ప్రవాహానికి కొట్టుకుపోయాడు.మృతదేహాలను స్వాధీనం చేసుకుని వారి కుటుంబాలకు అప్పగించామని, పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన...