భారతదేశం, ఫిబ్రవరి 18 -- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసులోని నిందితుడు కులవర్ధన్ శవమై తేలాడు. కురబాలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ముదివేడు పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.

మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి దొరకలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్‌ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీ...