భారతదేశం, జూన్ 18 -- ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగలు అనుభవించు రాజా అన్నట్టుగా ఎంచక్కా ఎంజాయ్ చేశారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయి.. ఏసీ ఆన్‌చేసుకుని దొంగతనం చేశారు. అంతే కాదు అక్కడ మ్యాగీని కూడా తయారు చేశాడు. ఏసీ చల్లని గాలిలో కాసేపు విశ్రాంతి తీసుకున్న దొంగలు ఇంట్లోని విలువైన వస్తువులతో పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దొంగలు చేసిన ఓ పని వైరల్ అయింది. ఈ దొంగలు ఏసీ ఆన్ చేసుకుని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అంతే కాదు అక్కడ మ్యాగీని కూడా తయారు చేసుకున్నారు. హాయిగా తినేసి ఏసీ చల్లని గాలిలో కాసేపు సేదతీరి ఆ తర్వాత ఇంట్లో చోరీ చేసి విలువైన వస్తువులతో పరారయ్యారు. లక్నోలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ సి-బ్లాక్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత బయటకు ...