భారతదేశం, ఆగస్టు 29 -- గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భంగా ముంబైలోని అంబానీ నివాసం 'యాంటిలియా'లో సందడి నెలకొంది. ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఆయన సతీమణి రాధికా మర్చంట్ ఆగస్టు 27న గణపతి బప్పాను తమ ఇంటికి తీసుకువచ్చారు. మరుసటి రోజు, ఆగస్టు 28న కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అనంత్, రాధిక గణపతి నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా ఫ్యాషన్ ప్రపంచంలో తన ప్రత్యేక శైలితో రాణించే రాధికా మర్చంట్.. ఈ గణపతి నిమజ్జనానికి ఒక సింపుల్, సంప్రదాయ దుస్తులను ఎంచుకున్నారు. ఆమె గులాబీ రంగులో ఉన్న బాంధిని అనార్కలీ సూట్‌లో మెరిశారు.

ఈ సూట్‌పై బాంధిని ప్యాటర్న్, రౌండ్ నెక్, క్వార్టర్ స్లీవ్స్ ఉన్నాయి. అలాగే, ముందు భాగంలో ఎంబ్రాయిడరీ, కుచ్చులు అలంకరించి...