భారతదేశం, మే 29 -- హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అధిక మాసానికి లేదా పురుషోత్తమ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మాసం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే పూర్ణిమ తిథిని 'సర్వ సిద్ధిదాయినీ పూర్ణిమ' అని పిలుస్తారు. సాధారణ పూర్ణిమలతో పోలిస్తే అధిక మాస పూర్ణిమ నాడు చేసే పూజలు, దానాలకు కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని వేద పండితులు చెబుతుంటారు. 2026లో జ్యేష్ఠ అధిక మాస పూర్ణిమ మే 31వ తేదీన రాబోతోంది. ఈ పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఈ ఏడాది పూర్ణిమ తిథి రెండు రోజుల పాటు ఉంది. హిందూ పంచాంగం ప్రకారం మే 30, శనివారం ఉదయం 11:57 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమై, మే 31, ఆదివారం మధ్యాహ్నం 02:14 గంటలకు ముగుస్తుంది.

పూర్ణిమ వ్రతం: చంద...