భారతదేశం, మే 14 -- స్టాక్ మార్కెట్ దిగ్గజం, 'ఒమాహా మాంత్రికుడు' వారెన్ బఫెట్ ఇన్వెస్టర్లను మరోసారి అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లు రికార్డు గరిష్టాల వద్ద ఊగిసలాడుతున్న తరుణంలో, ఇన్వెస్టింగ్ అనేది క్రమంగా జూదంగా మారిపోతోందని ఆయన విశ్లేషించారు. బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా మాట్లాడిన బఫెట్, మార్కెట్లో గూడుకట్టుకున్న 'అత్యాశ' (Greed) వల్ల అసెట్ ధరలు అర్థం లేని స్థాయికి చేరుతున్నాయని కుండబద్దలు కొట్టారు.

వారెన్ బఫెట్ 1986లోనే తన ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో 'అత్యాశ', 'భయం' అనేవి అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధులని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా మార్కెట్ అదే స్థితిలో ఉందని ఆయన గుర్తు చేశారు.

"ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం జూదపు మూడ్‌లో ఉన్నారు. మార్కెట్ గరిష్టాలకు చేరుతున్నప్పుడు అత్యాశ పెరిగి ధరలు అడ్డగోలుగ...