భారతదేశం, మార్చి 25 -- తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఏప్రిల్ 23న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వేడి అక్కడ అప్పుడే మొదలైపోయింది. ఈ ఎలక్షన్స్ కు సరిగ్గా నెల రోజుల ముందు నటుడు, రాజ్యసభ ఎంపీ అయిన కమల్ హాసన్ ఒక కీలక ప్రకటన చేశారు. తన పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదని, అధికార డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) కూటమికి కేవలం మద్దతు మాత్రమే ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు దళపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కజగం' (టీవీకే) పార్టీతో తొలిసారిగా ఈ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) అధికార ప్రతినిధి కోవై సత్యన్ ఈ ఇద్దరు స్టార్ హీరోల పైనా గట్టిగా సెటైర్లు వేశారు.

అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సత్యన్ రీసెంట్‌గా ఒక వీడియో రిలీజ్ చేసి కమల్ హాసన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డా...