భారతదేశం, జూన్ 23 -- మీరు రూ .17,000 రేంజ్‌లో కొత్త ఎల్ఈడీ టీవీని కొనాలని ఆలోచిస్తుంటే.. మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. రూ.17,000 కంటే తక్కువ ధరకే వచ్చే ఈ టీవీల్లో మంచి డిస్ ప్లే వస్తుంది. అద్భుతమైన సౌండ్ కూడా ఉంటుంది. శాంసంగ్ టీవీ కూడా ఈ జాబితాలో ఉంది. ఆ టీవీల గురించి చూద్దాం..

శాంసంగ్ 80 సెంమీ (32 అంగుళాలు) వండర్టైన్మెంట్ సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ UA32T4340BKXXL (గ్లోసీ బ్లాక్) ఈ శాంసంగ్ టీవీ ధర రూ.14490. ఈ శాంసంగ్ టీవీలో ఎన్నో గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 32 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నారు. టీవీలో అందిస్తున్న ఈ డిస్‌ప్లే 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్, డాల్బీ ఆడియోతో వస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉన్నాయి.

తోషిబా 80 సెం.మీ (32 అంగుళాలు) వ...