భారతదేశం, ఆగస్టు 1 -- మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో కోర్టు దోషిగా తేల్చింది. అతనికి శనివారం శిక్ష పడనుంది. ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఈ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు విన్న వెంటనే రేవణ్ణ ఏడ్చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది.

రేవణ్ణ ఫామ్ హౌస్ లో పనిచేసే పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు నిజమేనని కోర్టు తేల్చింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. రేవణ్ణపై హొళెనరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. ఇలాంటి నాలుగు కేసుల్లో రేవణ్ణ ప్రధాన నిందితుడు. మిగిలిన కేసుల విచారణ కొనసాగుతోంది.

నాలుగు కేసుల్లో ఒకదానిపై విచారణ పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు తీర్పును జూలై 30కి వాయిదా వేసింది. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ర...