భారతదేశం, జూలై 3 -- ్పీడ్ ప్రియులకు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేసేవారికి సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. డ్రైవింగ్ సమయంలో విన్యాసాలు చేసేటప్పుడు తమ తప్పు కారణంగా ప్రాణాలు కోల్పోయే వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీకి లేదని కోర్టు తెలిపింది. చనిపోయిన తర్వాత కోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తి తల్లిదండ్రులకు ఊరట కల్పించేందుకు కోర్టు నిరాకరించింది.

కర్ణాటకలో బెంగళూరు సమీపంలో 2014 జూన్ 18న ఎన్ఎస్ రవీష్ అనే వ్యక్తి ఓ కారులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో తండ్రి, సోదరి, పిల్లలు కూడా కారులో కూర్చున్నారు. మైలనహళ్లి అనే గ్రామం సమీపంలో రవీష్ అతివేగంతో వాహనం నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ప్రయాణ సమయంలో కారు రోడ్డుపై బోల్తా పడింది. ఆ ప్రమాదంలో రవీష్ మృతి చెందాడు. 80 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన భ...