భారతదేశం, జూలై 6 -- హీరో విడా వీఎక్స్2 ఈ స్కూటర్ ఇటీవలే విడుదలైంది. ఇది అత్యుత్తమ డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది. సరసమైన ధరకు అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్, బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్(BaaS) ప్లాన్‌ల కింద కస్టమర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కొత్త విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, స్పెసిఫికేషన్ల గురించి చూద్దాం..

హీరో విడా వీఎక్స్2 ఇ-స్కూటర్ వీఎక్స్2 అండ్ వీఎక్స్2 ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ విడా వీఎక్స్2 గో వేరియంట్ ధర రూ.99,000, విడా వీఎక్స్2 ప్లస్ ధర రూ.1.10 లక్షలు. అదేవిధంగా బాస్ ప్లాన్ కింద విడా వీఎక్స్2 గో ధర రూ.59,000, విడా వీఎక్స్2 ప్లస్ ధర రూ.64,000 (ఎక్స్-షోరూమ్).

కొత్త విడా వీఎక్స్2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఎంపికను కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 92...