భారతదేశం, సెప్టెంబర్ 23 -- మావోయిస్ట్ సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్‌పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. మల్లోజుల ఆయుధాలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఇటీవల సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భుపతి పేరుతో లేఖ విడుదలైంది. ఈ విషయంపై తాజాగా కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది.

మల్లోజుల వేణుగోపాల్‌ను ద్రోహిగా పేర్కొంటూ.. ఆయన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని కేంద్ర కమిటీ ఆదేశించింది. లొంగిపోవాలనుకుంటే వేణుగోపాల్, అతడి అనుచరులు వెంటనే ఆయుధాలు అప్పగించాలని చెప్పింది. లేదంటే వాటిని పీపుల్స్ గొరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ విడు...