భారతదేశం, మార్చి 25 -- వాషింగ్టన్/టెహ్రాన్: మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక భారీ వ్యూహాన్ని రచించారు. ఇరాన్ ఇంధన క్షేత్రాలపై దాడులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, శాంతి చర్చల కోసం 15 అంశాలతో కూడిన ఒక ముసాయిదాను (Ceasefire Plan) ఇరాన్ ముందుంచారు.

అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థలు 'న్యూయార్క్ టైమ్స్', ఇజ్రాయెల్‌కు చెందిన 'ఛానల్ 12' కథనాల ప్రకారం.. ట్రంప్ అత్యంత నమ్మకస్తులైన జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ ఈ 15 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. గాజా, లెబనాన్ తరహాలోనే ఇక్కడ కూడా నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి, ఈ లోపు శాశ్వత ఒప్పందం చేసుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ.

ఈ శాంతి ఒప్పందం కుదరాలంటే ఇరాన్ ఈ క్రింది డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుంది.

ఒకవేళ టెహ...