భారతదేశం, సెప్టెంబర్ 12 -- ప్రతి మనిషి జీవితంలో ప్రశాంతతను, సంతోషాన్ని కోరుకుంటాడు. అయితే కొన్ని సార్లు తెలియకుండా చేసే పొరపాట్లు, సరైన అవగాహన లేకపోవడమే వారి జీవితంలో పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. మహానుభావుడు ఆచార్య చాణక్యుడు తన 'నీతి శాస్త్రం'లో మానవ జీవితాన్ని సులభతరం చేసే అనేక అమూల్యమైన సూత్రాలను ప్రసాదించారు.

నాటి కాలంలో చెప్పిన ఈ నీతులు నేటి ఆధునిక కాలానికి కూడా వంద శాతం సరిపోతాయి. మనిషి జీవితంలో కొన్ని పరిస్థితులు దారుణమైన నష్టాన్ని, మానసిక క్షోభను మిగులుస్తాయని చాణక్యుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా జీవితాన్ని నరకప్రాయం చేసే ఆ మూడు ప్రధాన కష్టాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సరైన జ్ఞానం లేకపోవడం లేదా మూర్ఖంగా వ్యవహరించడం మనిషి జీవితంలో మొదటి మరియు అత్యంత పెద్ద కష్టమని ఆయన హెచ్చరించారు. లోకజ్ఞానం కొరవడినప్పుడు మనిషి అడుగువద్ద తప...