భారతదేశం, మార్చి 23 -- భారతీయ చలనచిత్ర చరిత్రలో చెంబూర్‌లోని 'ఆర్.కె. స్టూడియోస్'కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దిగ్గజ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ 1948లో స్థాపించిన ఈ చారిత్రక కట్టడం మళ్లీ ప్రాణం పోసుకోబోతోందని, రణ్‌బీర్ కపూర్ దీని కోసం ముంబైలో ఒక పెద్ద స్థలాన్ని లీజుకు తీసుకున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తాజాగా చెప్పేసింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరీనా కపూర్ ఈ విషయంపై స్పందిస్తూ.. "ఆర్.కె. స్టూడియోస్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నారనే వార్తల్లో అస్సలు నిజం లేదు. మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో కూడా దీనిపై చర్చ జరిగింది. 'ఇది జరగడం లేదు' అని అందరూ స్పష్టం చేశారు. బహుశా అభిమానులు అది మళ్లీ రావాలని బలంగా కోరుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు వస్తున్నాయని నేను భావిస్తున్నాను" అని తెలి...