భారతదేశం, డిసెంబర్ 21 -- ఎట్టకేలకు అవతార్ 3 సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. డిసెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా హాలీవుడ్ దర్శక దిగ్గజం డైరెక్ట్ చేసిన అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న అవతార్ 3లోని విజువల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.

గత రెండు భాగాల్లో మనల్ని నీటి అడుగున, దట్టమైన అడవుల్లో విహరింపజేసిన జేమ్స్ కామెరాన్ ఈ మూడవ భాగం 'ఫైర్ అండ్ యాష్'లో అగ్నిపర్వతాల నేపథ్యాన్ని ఎంచుకున్నారు. కేవలం విజువల్స్ కోసమే కాకుండా, పండోరా గ్రహంపై ఉండే మరో చీకటి కోణాన్ని చూపించడానికి ఆయన అత్యాధునిక సాంకేతికతను వాడారు.

ఈ సినిమాలో మనం చూస్తున్న అతిపెద్ద మార్పు 'యాష్ పీపుల్' (Ash People). ఇప్పటివరకు మనం చూసిన నావీ తెగలు చాలా శాంతంగా, ప్రకృతిని ప్రేమించేలా ఉంటాయి. కానీ, ఈ సినిమాలో అగ్నిపర్వతాల దగ్గర నివసించే ఈ ...